బద్దం ఎల్లారెడ్డి సంచలన విమర్శలు కాంగ్రెస్ మండల నాయకత్వంపై
ఇల్లంతకుంట, జూన్ 2 : రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం గాలిపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రతరంగా మారాయి. బద్దం ఎల్లారెడ్డి పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన మండల నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బద్దం ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు పార్టీని నడపలేక, పదవుల్లో కూర్చొని పైరవీలు, కమీషన్లు చూసుకుంటున్నారని, గాలిపల్లి PACS చైర్మన్ పదవిని రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, రైతులను మోసినవారిని పార్టీకి చేర్చుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 350 మంది రైతులను ముంచిన అవినీతిపరులను పార్టీ భుజాన వేసుకోవడం ఆయనకు అంగీకరణకాదు అని స్పష్టం చేశారు. సత్యనారాయణ మాట నమ్మి పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు మండల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.