సానిపల్లి ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి
రొద్దం, జూన్ 2 (AIMA MEDIA ): రొద్దం మండలంలోని సానిపల్లి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ కూలీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేస్ యాప్ విధానంతో కూలీలకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కూలీల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే పని ప్రదేశాల్లో పెండింగ్‌లో ఉన్న నాలుగు వారాల కూలి బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కూలీలతో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఉపాధి పనుల వద్ద కూలీలకు తాగునీరు, మజ్జిగ, గంపలు, గడ్డపారలు, ప్రాథమిక వైద్య సదుపాయాలు, మందులు, టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఐదు కిలోమీటర్లకు పైగా దూరంలో పనులకు వెళ్లే కూలీలకు రోజుకు రూ.20 నుంచి రూ.40 వరకు రవాణా భత్యం చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీరంగప్ప, పి. సరస్వతి, కుమ్మరి లక్ష్మీదేవి, కె. అంజనప్ప, కుమ్మరి గంగమ్మ, ఆదిలక్ష్మమ్మ, రంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010