logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ట్రెజరీ/CFMS బిల్లుల సమర్పణకు షెడ్యూల్ విడుదల

అమరావతి, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ/CFMS (నిధి) బిల్లుల సమర్పణకు నెలవారీ షెడ్యూల్‌ను అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇప్పటికే జారీ చేసింది.
🔹 ప్రతి నెల 6 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ, అరియర్స్, వేతనాల బిల్లులు సమర్పించాలి.
🔹 11 నుంచి 15వ తేదీ వరకు బడ్జెట్, GPF, లోన్లకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్ చేయాలి.
🔹 16 నుంచి 25వ తేదీ వరకు జీతాలు, పెన్షన్లు, ఇతర బిల్లులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.
🔹 నెల చివర్లో ప్రభుత్వ ప్రాధాన్య, అత్యవసర బిల్లులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అన్ని శాఖల DDOలు నిర్ణీత తేదీల్లోనే CFMS/ట్రెజరీలో బిల్లులు సమర్పించాలని, లేకపోతే ఆలస్యానికి తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

📰 AIMA MEDIA
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

11
533 views

Comment