logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈరోజు జిల్లాలో పర్యటించనున్న ఎస్సీ కమిషన్

శ్రీ సత్యసాయి జిల్లా, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు జూన్ 3 న శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ఎస్సీ వర్గాలకు సంబంధించిన సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

అలాగే ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.


📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

7
544 views

Comment