విచారణ లేకుండానే PGRS అర్జీల క్లోజ్..!!!
సత్య సాయి జిల్లా అధికారులు చేస్తున్న నిర్వాకం.....!!!
సోమందేపల్లి, జూన్ 1:(AIMA MEDIA )
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన PGRS వ్యవస్థను కొందరు అధికారులు నిర్లక్ష్యంగా మార్చేస్తున్నారంటూ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన మాల ప్రకాశ్ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా, బాధితుల వాదన వినకుండా, “పరిష్కరించబడింది” అంటూ పోర్టల్‌లో క్లోజ్ చేశారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మాల ప్రకాశ్, ఆయన భార్య అంజినమ్మ, తండ్రి క్రిష్టప్ప పేర్లపై పలు ప్రజా సమస్యలకు సంబంధించి PGRSలో అర్జీలు నమోదు చేశామని తెలిపారు. అయితే ఒక్క అధికారి కూడా ఇంటికి గానీ, సంఘటనా స్థలానికి గానీ రాలేదని, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, తమ వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించలేదని పేర్కొన్నారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వంనుంచి “మీ అర్జీ పరిష్కరించబడింది” అంటూ SMSలు రావడం, పోర్టల్‌లో “Closed”గా చూపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. అసలు ఏ విధంగా పరిష్కరించారో, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారో ఎక్కడా వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత మండల, డివిజన్ స్థాయి అధికారులు కార్యాలయాల్లో కూర్చొని తప్పుడు నివేదికలు అప్‌లోడ్ చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల వాగ్మూలం, క్షేత్రస్థాయి ఫోటోలు, పంచనామా, సంతకాలు లేకుండా అర్జీలు క్లోజ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు తమ ముగ్గురి ఆధార్ నంబర్లపై నమోదైన అన్ని అర్జీలను వెంటనే రీఓపెన్ చేసి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే విచారణ లేకుండా అర్జీలు మూసివేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏడు పని దినాల్లో చర్యల నివేదిక ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించి, హైకోర్టును ఆశ్రయిస్తామని మాల ప్రకాష్ హెచ్చరికలు జారీ చేసారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010