logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముసి నది పరిరక్షణకు యువత, ప్రజలు ముందుకు రావాలి! .. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ (CFT)..

హైదరాబాద్
1/06/2026.

ముసి నది చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థలు, చెరువులు, వెట్‌ల్యాండ్స్, సహజ జల వనరులు, జీవ వైవిధ్యం మరియు ప్రజల జీవన హక్కులను కాపాడేందుకు యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్య వర్గాలు, పర్యావరణ కార్యకర్తలు మరియు నగర ప్రజలు ముందుకు రావాలని క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ (CFT) పిలుపునిచ్చింది.

ముసి నది సమస్య అనేది కేవలం కాలుష్య సమస్య మాత్రమే కాదని, ఇది హైదరాబాద్ నగర భవిష్యత్తు, పర్యావరణ సమతుల్యత, ప్రజల ఆరోగ్యం, మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన కీలక అంశమని CFT కార్యకర్తలు పేర్కొన్నారు. దశాబ్దాలుగా చెరువుల ఆక్రమణలు, వెట్‌ల్యాండ్స్ నాశనం, శుద్ధి చేయని మురుగు నీటి విడుదల, నియంత్రణ లేని పట్టణ విస్తరణ మరియు ప్రకృతి వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల ముసి నది తీవ్ర పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ముసి పునరుజ్జీవనం పేరుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిజమైన పర్యావరణ పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యం, శాస్త్రీయ ప్రణాళిక మరియు సామాజిక న్యాయంపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రజల నివాస హక్కులు, జీవనోపాధులు మరియు బస్తీ ప్రజల హక్కులు దెబ్బతినకూడదని స్పష్టం చేసింది.

ముసి పరిరక్షణ అనేది కాలుష్య నియంత్రణతో పాటు చెరువుల పునరుద్ధరణ, వరద మైదానాల రక్షణ, భూగర్భ జలాల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు ప్రజా ఆరోగ్య భద్రతతో ముడిపడి ఉందని పేర్కొంది. నదులు కేవలం ఆధునికరణం కోసం ఉపయోగించే ప్రదేశాలు కాకుండా, జీవ వ్యవస్థలుగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ రాష్టం లో ఉన్న యువతను, విద్యార్థులను మరియు ప్రజాస్వామ్య వర్గాలను పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని, ముసి పరిసర ప్రాంతాల్లో ప్రజలతో చర్చలు నిర్వహించాలని, బస్తీ స్థాయి ప్రజా అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయాలని మరియు పర్యావరణ న్యాయం కోసం విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో ప్రజా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, స్టడీ సర్కిల్స్, బస్తీ స్థాయి చర్చలు మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రజా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు CFT కార్యకర్తలు తెలిపరు.

35
5429 views

Comment