చర్ల MRO పై MLA కు ఫిర్యాదు చేసిన గొండ్వాన సంక్షేమ పరిషత్
భద్రాచలం, 01 జూన్ 2026:
చర్ల MRO పై MLA కు గొండ్వాన సంక్షేమ పరిషత్ ఫిర్యాదు చేసింది.చర్ల MRO బదిలీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.అనంతరం గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ., 30వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆళ్లపల్లి,చంద్రుగొండ, గుండాల, ఇల్లందు, దమ్మపేట మరియు భద్రాచలం MRO సాధారణ బదిలీలు చేశారని.. అ బదిలీ లలో చర్ల ఎమ్మార్వో ను బదిలీ చేయకపోవడం విచారం అని అన్నారు.
చర్ల మండలంలో ఇసుక, గ్రావెల్, మట్టి ఇతర జీరో దందా కార్యక్రమాలకు ప్రభుత్వ భూముల సైతం ఆక్రమిస్తున్న గిరిజనేతరుల కు MRO వత్తాసు పలుకుతన్నారని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్య ధోరణి అవాలంభిస్తున్నారని విమర్శించారు.
కేశపురం పంచాయతీ గుంపెనగుడెం పరిధిలో తాళిపేరు ఇసుక ర్యాంపు రాత్రి పగలు తేడా లేకుండా వందల ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా అవుతున్నా MRO చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.