అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, జూన్ 1 ( AIMA MEDIA ): ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. శాఖల వారీగా అందిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010