నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన నాయకులునాయకులు
నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రజా వాయిస్ కోనరావుపేట సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన పసుపునూరి పద్మ w/ o మహేందర్ చాలా నిరుపేద కుటుంబం ఉండడానికి ఇల్లు లేదు ఇంటి స్థలం కూడా లేదు అయినప్పటికీ ఆ కుటుంబంలో ఆణిముత్యం లాంటి కొడుకు పుట్టాడు పేరు పసుపునూరి శ్రీకాంత్ మరిమడ్ల జడ్పిహెచ్ఎస్ స్కూల్ లో10 th క్లాస్ చదువుకుంటున్నాడు ఈరోజు జరిగిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 12వ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలో భాగంగా అండర్ 18 విభాగంలో గ్రామం నుండి పరుగు పందెంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఇట్టి ఎంపిక గ్రామానికి గర్వకారణంగా గ్రామ ప్రజలు భావిస్తున్నారు శ్రీకాంత్ మున్ముందు ఎన్నో విజయాలు సాధించాలని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి ఉండడానికి ఇల్లు లేదు ఇంటి స్థలం కూడా లేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నిరుపేద కుటుంబానికి గతంలో కేటాయించిన గవర్నమెంట్ ప్లాట్లు నిరుపయోగంలో ఉన్నాయి వాటిపై సమగ్ర విచారణ జరిపించి అందులో ఒక ఇందిరమ్మ ఇల్లు కేటాయించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు