అంగన్వాడీల్లోనే పిల్లల చేరికకు ప్రాధాన్యం
మూడు మండలాల వర్కర్లతో సీడీపీవో సమావేశం, ర్యాలీ
సోమందేపల్లి, జూన్ 1:
సోమందేపల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో సోమందేపల్లి, పరిగి, గోరంట్ల మండలాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లతో సీడీపీవో డాక్టర్ శాంతలక్ష్మి సోమవారం ప్రాజెక్టు స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే “అంగన్‌వాడీ పిలుస్తోంది” కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య, పాలు, గుడ్డు, పోషకాహారం అందిస్తున్నామని, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రీ-స్కూల్ విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కాన్వెంట్లకు కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలని సూచించారు.
అలాగే ఐదేళ్లు నిండిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్లు ర్యాలీ నిర్వహించి “ఫీజులు ఎందుకు దండగ.. అంగన్‌వాడీలు ఉండగా” అంటూ నినాదాలు చేశారు. మానవహారం కూడా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాధ, శుభారాణి, నాగరాణి, లలితమ్మ, శంకరమ్మ, మంజులతో పాటు మూడు మండలాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010