logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లాడ్జ్లలో QR కోడ్లు, అవగాహన పోస్టర్లు ఏర్పాటు పెనుకొండలో PLMS అమలు వేగవంతం

పెనుకొండ, జూన్ 1(AIMA MEDIA ): శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు పెనుకొండ పట్టణంలోని లాడ్జ్‌లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో పెనుకొండ లాడ్జ్ మానిటరింగ్ సిస్టమ్ (PLMS) అమలును మరింత సమర్థవంతంగా చేపట్టారు. ఇందులో భాగంగా అతిథుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన QR కోడ్‌లతో పాటు, భద్రతా సూచనలు, పోలీసు శాఖ మార్గదర్శకాలతో కూడిన అవగాహన పోస్టర్లను ప్రతి లాడ్జ్ రిసెప్షన్‌తో పాటు గదుల్లో ఏర్పాటు చేశారు.
ఈ పోస్టర్ల ద్వారా లాడ్జ్ నిర్వాహకులు అతిథుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాల సమాచారం, రాకపోకల వివరాలను సకాలంలో నమోదు చేయడంతో పాటు, పోలీసు శాఖ సూచనలను సమర్థంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సోమందేపల్లి ఎస్‌ఐ, పెనుకొండ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి అతిథి ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించి పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు, వదిలివేయబడిన సామాన్లు, అక్రమ కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజల భద్రత, నేర నియంత్రణతో పాటు లాడ్జ్‌లలో బస చేసే వారి వివరాలపై సమగ్ర పర్యవేక్షణే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. “మీ భద్రత కోసం – మీ సహకారం అవసరం” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి లాడ్జ్ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని సూచించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

24
1193 views

Comment