logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోగొట్టుకున్న రూ.2 లక్షల చెక్కు అప్పగింత నిజాయితీ చాటిన యువకుడికి పోలీసుల ప్రశంసలు

పెనుకొండ, జూన్ 1: హిందూపురం నుంచి పెనుకొండకు బస్సులో ప్రయాణిస్తున్న మహమ్మద్ తయూబ్ అనే వ్యక్తి అనుకోకుండా రూ.2 లక్షల విలువైన చెక్కును పోగొట్టుకున్నారు. ఆ చెక్కు పెనుకొండకు చెందిన విష్ణు వర్ధన్‌కు దొరకడంతో వెంటనే పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు.
విష్ణు వర్ధన్ చెక్కును తీసుకుని పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జి. సుధాకర్ యాదవ్‌కు అందజేశారు. పోలీసులు చెక్కుకు సంబంధించిన వివరాలు పరిశీలించి యజమాని మహమ్మద్ తయూబ్‌ను సంప్రదించి స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం చెక్కును ఆయనకు సురక్షితంగా తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ ప్రదర్శించిన నిజాయితీని అభినందించిన ఎస్‌ఐ సుధాకర్ యాదవ్, ఆయనను శాలువాతో సత్కరించారు. దొరికిన విలువైన వస్తువులు, పత్రాలు లేదా నగదును సంబంధిత యజమానులకు చేరేలా పోలీసులకు అప్పగించాలని సూచించారు.
విష్ణు వర్ధన్ చూపిన నిజాయితీ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పెనుకొండ పోలీసులు పేర్కొన్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

11
1065 views
1 shares

Comment