ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో... పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్
AIMA న్యూస్ :
👉 ఆముదాలవలస నియోజకవర్గం లో సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి అందజేశారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, విడో మహిళలకి అనేక వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేలలు అండగా ఉంటుందని, ఎవరు నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే రవికుమార్ హామీ ఇచ్చారు
👉 కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే వృద్ధులుకి 4000, వికలాంగులకు 6000, శాశ్వత వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శివాల సూర్యనారాయణ గారు , మండల అధ్యక్షులు అంబాల రాంబాబు గారు, కిల్లి సిద్ధార్థ గారు, తాడేల రమణగారు, స్థానిక కూటమి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
👉 ఈ గ్రామంలో పెన్షన్ అందుకున్న వృద్ధులు, మహిళలు ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి ,గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.