logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెనుకొండలో లాడ్జ్ మానిటరింగ్ సిస్టమ్ ప్రారంభం అతిథుల వివరాలు ఆన్లైన్ నమోదు తప్పనిసరి

పెనుకొండ, జూన్ 1: ప్రజల భద్రత, నేర నియంత్రణతో పాటు లాడ్జ్‌లలో బస చేసే అతిథుల వివరాల సమగ్ర పర్యవేక్షణ కోసం *పెనుకొండ లాడ్జ్ మానిటరింగ్ సిస్టమ్ (PLMS)*ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ వ్యవస్థ ద్వారా పెనుకొండ పరిధిలోని లాడ్జ్‌లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, డార్మిటరీల్లో బస చేసే అతిథుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి అతిథి ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని, పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
అలాగే సీసీటీవీ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే అంశాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వారికి వసతి కల్పించరాదని స్పష్టం చేశారు. పోలీసు తనిఖీలు, దర్యాప్తులకు యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, సోమందేపల్లి ఎస్‌ఐ జి.సుధాకర్ యాదవ్ (పెనుకొండ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ) మాట్లాడుతూ.. లాడ్జ్ యాజమాన్యాలు పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించి ప్రజల భద్రతలో భాగస్వాములు కావాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు.
“సురక్షిత అతిథులు – సురక్షిత లాడ్జ్‌లు – సురక్షిత పెనుకొండ” అని పోలీసులు తెలిపారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

28
1358 views

Comment