logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎన్టీఆర్ నగర్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం

ప్రెస్ నోట్

ఎన్టీఆర్ నగర్‌లో పింఛన్ పంపిణీ కార్యక్రమం

కడప, జూన్ 1:

కడప జిల్లా కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ నగర్‌లో కడప నగరం ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి డివిజన్ ఇంచార్జ్ జి. రాణి, ఉదయ్, దివాకర్, బూత్ ఇంచార్జ్‌లు అనురాధ, రోజా, లక్ష్మీ ప్రసన్న, శ్రీరేఖతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పింఛన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగిందని, ప్రజలు హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

0
501 views

Comment