ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని పండుగలా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే: బోనం శిలాస్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని పండుగలా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే: బోనం శిలాస్
కడప, జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతోందని, ఈ కార్యక్రమాన్ని పండుగలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెందుతుందని టీడీపీ కడప సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనం శిలాస్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి సూచనలతో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బోనం శిలాస్ మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్లను లబ్ధిదారులకు అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. అవ్వలు, తాతలు, వికలాంగులు, దివ్యాంగులు పెన్షన్లు అందుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఎటువంటి అంతరాయం లేకుండా వేల కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోందని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా, సచివాలయ సిబ్బంది ద్వారా పారదర్శకంగా ఒక్కరోజులోనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం విశేషమన్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల రాష్ట్రంలోని ఏదో ఒక మారుమూల ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు పసుపులేటి గౌతమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్ రెడ్డి, శివాలయం చైర్మన్ పలినేని నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డీఎస్ హాజీ, 7వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ గొంటుముక్కుల చిన్నబాబు, ఎద్దుల రవి, 183వ బూత్ ఇన్‌చార్జ్ బోనం అబ్రహాం, కోవెలకుంట్ల శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.