logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డ.. జనసేన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.

ఆళ్లగడ్డ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి జనసేన పార్టీ నాయకుడు, నీటి సంఘం డైరెక్టర్ E .నారాయణరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి సకాలంలో పింఛన్ల సొమ్మును అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను లబ్ధిదారులకు సకాలంలో చేరవేసేందుకు కూటమి శ్రేణులు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా E.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఎరిగొల్ల గుర్రప్ప, గణపతి తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు.
తమకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందించినందుకు వృద్ధులు, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

5
679 views

Comment