logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్యాంక్ అధికారులే ఆన్లైన్ కేటుగాళ్ల మాయలో 206 కోట్లను మాయం

*బ్యాంక్ డబ్బు 2.06 కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఆఫీసర్ ను అరెస్ట్ చేశారు*. సరే ఆ కోట్లను రికవరీ చేసి బ్యాంక్ కు అప్పజెప్పేది ఎలా అనేదే కోటిరూపాయల ప్రశ్న. వివరాల్లోకి తొంగి చూద్దామా.? 14 రోజుల్లో రూ.2.06 కోట్లు ఖర్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు తేజావత్ తిరుపతమ్మ. ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో క్యాషియర్ గా పని చేస్తోంది. ఈవిడ కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 2 కోట్ల 6 లక్షల రూపాయలను మాయం చేసేసింది. అంత డబ్బు ఏం చేశావని అధికారులు అడిగినప్పుడు, ఆవిడ చెప్పిన సమాధానం విని వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది. టీ, స్నాక్స్, భోజనానికి రూ. 61 లక్షలు ఖర్చు చేసిందట. బ్యాంక్ బిల్డింగ్ మెయింటెనెన్స్‌కోసం రూ. 50 లక్షలు ఇచ్చిందట. మిగిలిన అమౌంట్ ను ఇతరత్రా ఖర్చుల కింద చూపించేసింది. అసలు విషయం ఏంటంటే, మేడమ్ గారు తన సొంత ఖాతాల్లోకి ఈ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదు. మేడమ్ గారు ఒక ఆన్‌లైన్ కేటుగాడి ట్రాప్‌లో పడ్డారు. మీరు పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయంటూ చెప్పిన ఒక కేటుగాడిని నమ్మి, రూ.206 కోట్లను విడతల వారీగా ఆ స్కామర్ల అకౌంట్లలోకి బదిలీ చేసేసింది. అదన్నమాట సంగతి. చివరకు అధికారులు నిలదీసేసరికి కవర్ చేయడానికి ఈ టీ, స్నాక్స్ కథలన్నీ అల్లేసింది. ప్రస్తుతం ఈ మేడమ్ గారు కటకటాల వెనుక ఊచలు లెక్కపెడుతోంది. బ్యాంక్ అధికారులే ఆన్‌లైన్ కేటుగాళ్ల మాయలో పడితే, ఇక సామాన్యుల సంగతి వేరే చెప్పాలా?. ఈ ఘటన గతేడాది జరిగింది.

0
12 views

Comment