logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యార్థులకు శుభవార్త త్వరలో డైట్ ఛార్జీల పెంపు?

అమరావతి, మే 31 (AIMAMEDIA): రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశముంది. పెరిగిన నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.52 లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. వారం నుంచి పది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్త విద్యా సంవత్సరం దృష్ట్యా జూన్ లేదా జులై నుంచి అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

4
344 views

Comment