పొగాకు దూరంగా ఉండండి.. ప్రాణాలు రక్షించుకోండి: డాక్టర్ ఓంకార్
సత్యసాయి , మే 31 (AIMA MEDIA ): పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణుడు డాక్టర్ ఓంకార్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సిగరెట్లు, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమని హెచ్చరించారు. యువత ముఖ్యంగా ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010