వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులకు ప్రవేశాలు
వెంకటగిరి, మే 31 (AIMA MEDIA ) : తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రకాశ్ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్, ఐటీఐ పూర్తిచేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించారు.
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నెలకు రూ.2,500 స్టైపెండ్ అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నత విద్య కొనసాగించే అవకాశం కూడా ఉంది.
1992లో ప్రారంభమైన ఈ సంస్థ దేశంలోని 11 హ్యాండ్లూమ్ ఇన్‌స్టిట్యూట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాల విద్యార్థులు కూడా అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుల చివరి తేదీ మే 30. పూర్తి వివరాలకు iihtvgr.com లేదా 9399936872, 9866169908, 9010243054 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010