శ్రీ సత్యసాయి జిల్లాలో వింత కోనేరు..
కోనేరులో వేసిన నిమ్మకాయ బావిలో ప్రత్యక్షం!
రొళ్ల ( AIMA MEDIA ): సత్యసాయి జిల్లాలోని ఓ పురాతన ఆలయం వద్ద ఉన్న కోనేరు స్థానికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోనేరులో వేసిన నిమ్మకాయ కొద్దిసేపటికే సమీపంలోని బావిలో కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కోనేరు, బావి మధ్య భూగర్భ జలమార్గం ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010