ఊబిలో ఇరుక్కొని యువకుడు మృతి
తేదీ:30-05-2026
కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్(25) స్నేహితులతో కలిసి మైనింగ్ క్వారీ సంబంధించిన గుంతలో ఈతకు వెళ్లారు. అట్టి గుంత ఊబితో ఉన్నందున అందులో ఇరుక్కుపోవడంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసిన లాభం లేకపోయింది. వారు ఆ గ్రామ సర్పంచ్ కు సమాచారము ఇవ్వగా సర్పంచి పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.