logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టెలి-మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలి

తేది:30.05.2026
కామారెడ్డి జిల్లా
శనివారం

*టెలి-మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలి* :

పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి:

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ (DLCCS) సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించడం జరిగింది.

పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక ఆర్థిక దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) అమలును జిల్లాలో మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్ని విద్యాసంస్థల్లో Tobacco Free Educational Institutions (ToFEI) మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని, పాఠశాలల చుట్టూ 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా నిరోధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పొగాకు వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతి పాఠశాలలో “టొబాకో మార్షల్స్” వ్యవస్థను ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో పొగాకు వినియోగం, ఇతర వ్యసనాల నివారణపై పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, ర్యాలీల ద్వారా అవగాహన పెంపొందించాలని తెలిపారు.
విద్యార్థులు, యువతలో మానసిక ఒత్తిడి, పరీక్షల సమయంలో కలిగే ఆందోళనలు మరియు వ్యసనాల సమస్యలకు పరిష్కారంగా టెలి-మానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నంబర్‌ను అన్ని విద్యాసంస్థల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ రైతులకు పొగాకు పంటలకు ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటల సాగుపై అవగాహన కల్పించాలని, ఎన్‌జీఓలు ప్రజల్లో పొగాకు వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఫుడ్ సేఫ్టీ శాఖ గుట్కా, పొగరహిత పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, మెడికల్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
పొగాకు నియంత్రణలో విద్యార్థులు, కుటుంబాలు, సమాజం భాగస్వామ్యం కావడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు

ఈ సమావేశంలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి రవీందర్ , జిల్లా విద్యాశాఖాధికారి, పోలీస్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, DPRO , ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

18
518 views

Comment