logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భూపాలపల్లి జిల్లా: వంద పడకల హాస్పిటల్ లో శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకులు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్బంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల అధ్యక్షుడు లేతకారి రాజబాబు ఎస్సీ సెల్ సభ్యులతో పాల్గొన్నారు.
లేతకారి రాజబాబు మాట్లాడుతూ ఈరోజు పండగ రోజు అని, పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పని చేస్తున్న నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారే అని గుర్తు చేశారు. ఐదోసారి గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ నాయకుల పర్యవేక్షణలో కూడ నియమితులు అని తెలిపారు. మంథని ప్రజలు శ్రీధర్ బాబును జననేతగా పిలవడం గౌరవంగా భావిస్తున్నారు.

39
1267 views

Comment