logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాబితా సవరణ వేగవంతం చేయాలి జిల్లాల ఎన్నికల అధికారికి సూచన

జయశంకర్ భూపాలపల్లి: ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుధర్శన్ రెడ్డి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, ఆర్ ఐ లు, బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సి.సుధర్శన్ రెడ్డి స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని పేర్కొన్నారు మరియు అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బి ఎల్ ఓ లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ చేపడుతున్నారని, ఆన్‌లైన్‌లో కూడా ఓటర్లు తమ వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు.

14
329 views

Comment