logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్-ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహనపై గోడ పత్రిక ఆవిష్కరణ......


తేదీ: 30-05-2026* శేరిలింగంపల్లి చందానగర్:
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు జరిగే అనర్ధాలను తెలియజేస్తూ
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మద్రించిన గోడ పత్రిక (స్టిక్కర్)ను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ M లక్ష్మారెడ్డి (సర్కిల్ ఇన్ స్పెక్టర్, Women and Children Safety Wing, Gachibowli) గారు వారి కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించి తదనంతరం మాట్లాడుతూ " *ప్రపంచ ఆరోగ్యసంస్థ వారు మే నెల 31వ తారీఖునాడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1988వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు"* అని అన్నారు.
" *ఈ సంవత్సరపు నినాదం ' _నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవాలని పిలుపునివ్వడం"*_ అని అన్నారు. " *ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వలన ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన పెంచడమే"* అని అన్నారు. " *పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను సేవించడం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి"* అని అన్నారు. " *ముఖ్యంగా యువత ధూమపానానికి బాగా అకర్షితులవుతున్నారు. పొగ త్రాగడం వలన ఊపిరితిత్తుల, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తుల, ఉదరకోశ క్యాన్సర్ తో పాటు క్షయ, దంతక్షయం, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి"* అని అన్నారు. " *పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం వలన రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అజీర్తి వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు తమ నివేదికల ద్వారా హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో స్మోకింగ్ కారణంగా యేటా 13.5 పైచిలుకు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, సిగారు, గుట్కా, పాన్ పరాగ్, హుక్కా, బీడీ, నశ్యము మొదలైన వాటిని అనేక రూపాలలో వినియోగిస్తున్నారు. నమలడం, పీల్చటం లాంటి మొదలైన పద్ధతులలో వీటిని ఉపయోగించే వారితో పాటు ప్రక్కన ఉండి పొగ పీల్చే వారు కూడా పైన ఉదహరించివ రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీనినే 'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్' అంటారు. ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుంది. ఒక సిగరెట్ కనుక తాగితే మనిషి యొక్క జీవితకాలంలో 20 నిమిషాల ఆయుష్షు తగ్గినట్టే. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఆరోగ్యం క్షీణించడం, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చివరకు ప్రాణనష్టం కూడా జరుగుతూ ఉంది. ఆరోగ్యమే మహా భాగ్యము కావున ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మన చేతులలో ఉంటుంది. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం మరియు ఎగుమతులలో చైనా, ఇండియా మొదటి రెండు స్థానాలలో ఉండగా బ్రెజిల్, USA, ఇండోనేషియా తరువాతి స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ మరియు కర్నాటక తదితర రాష్ట్రాలలో పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో పాటు పౌష్టికాహారం తీసుకుని మంచి జీవనంతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి"* అని అన్నారు. " *పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను సేవించేవారు వాటిని మానాలంటే పొగ త్రాగాలని అనిపించినపుడు ఆరోగ్యకరమైన చిరు తిండ్లను తినడం ద్వారా మరియు నారింజ, బత్తాయి, ద్రాక్షా వంటి పండ్లను తినడం లేదా పండ్ల రసాలను త్రాగడం, చూయింగ్ గమ్ నమలడం, చాక్లెట్లు తినడం, పుదీనా ఆకులు లేదా పుదీనా నీరు త్రాగడం, పచ్చి కూరగాయలు తినడం, మంచినీరు ఎక్కువగా త్రాగడం, దాల్చిన చక్క, యాలకులు, లవంగాలను నమలడం, గోరువెచ్చని పాలు త్రాగడం, నిమ్మకాయ నీరు త్రాగడం ద్వారా ఈ దురలవాట్లను మానవచ్చు"* అని తెలిపారు. " *దీనికి సంకల్పబలం ఉంటే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు, కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి* " అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు M శ్రీహరిబాబు, కొత్తపల్లి కోటేశ్వరరావు, అమ్మయ్య చౌదరి, G V రావు, సత్యనారాయణ, వాణీ సాంబశివరావు, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

7
169 views

Comment