logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచన

భూపాలపల్లి: అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. శుక్రవారం ఐడిఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ మరియు పౌర సరఫరాలు, రవాణా, వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, పిఎసిఎస్ సీఈఓలు, ఏపిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ మక్కల కొనుగోలులో జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని, అదే స్ఫూర్తితో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు తప్పనిసరిగా ట్రక్ షీట్ ఇవ్వాలని, ధాన్యం కాంటా తర్వాత వెంటనే ట్యాబ్ ఎంట్రి చేయాలని, ఐరిస్ పద్ధతిని తొలగించి ఓటిపి ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా ట్రక్ షీట్ల జారీపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.అతనితో పాటు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాలు, రవాణా, సహకార శాఖల అధికారులు, మిల్లర్లు, పిఎసిఎస్ సీఈఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు. ధాన్యం నిల్వకు ఎత్తైన ప్రదేశాలను ఉపయోగించి, లారీల కొరత ఉంటే ట్రాక్టర్ల ద్వారా మిల్లర్లకు సరఫరా చేయాలని సూచనలు ఇచ్చారు.

7
834 views

Comment