బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొమ్మనబోయిన సైదులు యాదవ్
హైదరాబాద్ :-29/05/26
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి సమక్షంలో కొమ్మనబోయిన సైదులు యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు డా. తుంగ బాలు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. తుంగ బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయిందని తీవ్రంగా విమర్శించారు.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, “విద్యా భరోసా కార్డు” అమలు చేస్తామని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ప్రచారం చేశారని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా విద్యా భరోసా కార్డు అమలు కాలేదని, నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరలేదని, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందని అన్నారు. రాష్ట్రంలోని యువత ఆశలు, ఆకాంక్షలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గురుకులాల విస్తరణ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి వర్గానికి అండగా నిలిచిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా కార్యక్రమాలు, కేసీఆర్ గారి దూరదృష్టి నాయకత్వం పట్ల ఆకర్షితులై కొమ్మనబోయిన సైదులు యాదవ్ పార్టీ లో చేరడం ఆనందదాయకమని తెలిపారు.
ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, సైదులు యాదవ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.రాష్ట్ర ప్రజల ఆశయాలను నిజంగా నెరవేర్చగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, మళ్లీ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని డాక్టర్ తుంగ బాలు స్పష్టం చేశారు.