logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాములోరి కల్యాణం రమణీయం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన కోవె లలో కొలువైన మూలమూర్తులు దర్శనమివ్వ డంతో భక్తులు పులకించారు. జైశ్రీరామ నామా లతో ఆలయ పరిసరాలు అలరారాయి. రామ య్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవ చనం ఆకట్టుకుంది. ప్రవరను పఠించి సీత మ్మకు యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక రమణీయంగా నిర్వహించారు. దర్బారు సేవ రాముడి వైభవాన్ని రెట్టింపు చేసింది. భజనలు కీర్తనలతో ఈ ప్రాంగణం ఆధ్యాత్మికతను పెంచింది. శ్రీనమ్మాళ్వార్ తిరు నక్షత్ర ఉత్స వాన్ని పురస్కరించుకుని మధుర పదార్థాన్ని నివేదించారు. చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం చేశారు.

0
12 views

Comment