logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"మహానాడు" కీలక తీర్మానాల వేదికగా రెండవ రోజు కార్యక్రమం మంత్రి రామ్మోహన్ నాయుడు

రాబోయే సంవత్సరానికి క్యాడర్ ను దిశా నిర్దేశం చేసే తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ "మహానాడు"లో కీలక తీర్మానాలకు వేదికగా రెండవ రోజు కార్యక్రమం నిలిచింది.

గతంలో నా తండ్రి దివంగత కింజరాపు ఎర్రంనాయుడు గారు ప్రవేశపెట్టే ముఖ్యమైన రాజకీయ తీర్మానం.., ఈ మహానాడులో నేను ప్రవేశపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను.

"సుస్థిర పాలన, నిరంతర పరిపాలన" ఇకపై రాష్ట్రంలో ఉండాలని కోరుతూ రాజకీయ తీర్మానం నేను ప్రవేశపెడితే.. దాన్ని బలపరుస్తూ వేదిక తోడ్పాటు అందివ్వడం ఆనందంగా ఉంది.

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరాన్ని వివరిస్తూ.. ఏ ఎన్నిక జరిగినా క్యాడర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చాను.

రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు కావలసినంత శక్తిని, ఆలోచనలను నింపుకుని మహానాడు-2026ను ముగించాము.

24
5244 views

Comment