కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో పుష్కరాలకు ఉచిత అన్నదానం
కాళేశ్వరం పుణ్యక్షేత్రం: పుష్కరాలకు విచ్చేసిన భక్తుల కోసం దేవాలయం ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు ఆహార సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి రోజు పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు.దేవస్థానం సిబ్బంది మరియు వాలంటీర్లు సమన్వయంతో అన్నదానం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేవస్థానం ఈఓ మహేష్ ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది.