ఆళ్లగడ్డ లో ఘనంగా. జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లా రెడ్డి జన్మదిన వేడుకలు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ తాలూకా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ, ప్రజాసేవలో దూసుకుపోతున్న జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లా రెడ్డి జన్మదిన వేడుకలు ఆళ్లగడ్డ ,శిరివెళ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన పార్టీ శ్రేణులు, ఇరిగెల అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానం వెల్లువెత్తింది. నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన కార్యకర్తలతో శిరివెళ్ల జనసేన కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన భారీ కేక్‌ను జనసేన శ్రేణుల సమక్షంలో కట్ చేశారు. అనంతరం ‘ఇరిగెల రాంపుల్లా రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ. నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతూ, పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు రాంపుల్లా రెడ్డి అని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లూ, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని, వారి కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులను అలంకరించి, ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలను అందించాలని. ఇరిగెల ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ తాలూకాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
ఆలమూరు గౌస్
ఓబుళా కొండా రెడ్డి
K. తేజోనాధ్ (తేజ)
పఠాన్ ఇబ్రహీం ఖాన్
తలారి పెద్ద బాలయ్య
బండెద్దుల ఖాదర్
హుస్సేన్ పీరా
పెసరాయి చాంద్ బాషా
పోల నాగరాజు శెట్టి
సి. మధు
ముల్లా అక్బర్ బాషా
చెన్నూరు అశోక్
ఆలమూరు రఫీ
చిన్న కంబలూరు రవి
ఉల్లి రమేష్
ఇట్టెం మద్దిలేటి
నామాల వెంకటస్వామి
రాం సుబ్బయ్య
షేక్ సమీర్, జాబీర్
పెసరాయి జాఫర్
ఆలమూరు మహాబూబ్ బాషా
ఫారూఖ్, యూనుస్, బుర్రు ఖలీల్
మరియు తదితర జనసేన పార్టీ మండల, తాలూకా స్థాయి నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.