logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కందికట్కూర్ ఎల్లమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు

మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు, మంగళహారతులతో స్వాగతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, రైతాంగ అభివృద్ధి, ఆరోగ్య ఆశీస్సులు కోరారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో గ్రామ దేవతల జాతరల ప్రాముఖ్యతను వివరించారు.

మాజీ ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు యాస తిరుపతి, విజయ్, రజినీకాంత్, మహేష్, మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, అభివృద్ధికి ప్రభుత్వ చర్యలపై హామీలు ఇచ్చారు.

0
0 views

Comment