logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇల్లెందు పట్టణంలో ప్రముఖ విద్యాసంస్థగా కొనసాగుతున్న మాంటిస్సోరి పాఠశాల రహదారి వివాదం గురువారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

ఇల్లెందు పట్టణంలో ప్రముఖ

విద్యాసంస్థగా కొనసాగుతున్న మాంటిస్సోరి పాఠశాల రహరి వివాదం గురువారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో వ్యాపారి అభిమన్యు ఇనుప కంచె ఏర్పాటు చేయడం, అనంతరం పాఠశాల సిబ్బంది దానిని తొలగించడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల సమీపంలోని స్థలం తమ కుటుంబానికి చెందిన పట్టా భూమి అని వ్యాపారి అభిమన్యు పేర్కొన్నారు. తమ వద్ద భూమికి సంబంధించిన పూర్తి పత్రాలు ఉన్నాయని, తమ భూమిని ఆక్రమించేందుకు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రయత్నాలుగతంలో కూడా స్థలాన్ని గుర్తిస్తూ కంచె వేసినప్పటికీ, ఇప్పుడు తమ హక్కులను కాపాడుకునేందుకే మళ్లీ ఇనుప కంచె ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. “మా స్థలాన్ని ఇంతకాలం వాడుకుంటూ వచ్చారు. మేము కానీ ఇప్పుడు పరిస్థితులు సహకరించాం. మారాయి. మా పట్టా భూమిని పూర్తిగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని అభిమన్యు పేర్కొన్నారు. ఈ విషయంలో చట్టపరంగానే ముందుకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇక పాఠశాల యాజమాన్యం మాత్రం రహదారి విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత 33 సంవత్సరాలుగా ఇదే మార్గంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారని ప్రిన్సిపల్ తెలిపారు.ఇన్నేళ్లుగా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని వారు ఇప్పుడు అకస్మాత్తుగా రహదారిని మూసివేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలకు వెళ్లే దారిలో కంచె ఏర్పాటు చేయడంతో చిన్నారులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి కంచెను తొలగించారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల కొంతకాలంగా ఈ రహదారి అంశంపై ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల రాకపోకలు, భూమి హక్కుల అంశం కలగలిపి వివాదం మరింత కనిపిస్తున్నాయి.

10
569 views

Comment