ఖమ్మం-పాలేరు రహదారి వెంట భారీ అగ్నిప్రమాదం
ఖమ్మం-పాలేరు పాత రహదారి వెంట కూసుమంచి కిరణ్ స్టోన్ క్రషర్ పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో కొంతమంది రైతులు వరి కొయ్యలు తగలబెట్టడంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఖమ్మం-పాలేరు పాత రహదారి వెంట కూసుమంచి కిరణ్ స్టోన్ క్రషర్ పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో కొంతమంది రైతులు వరి కొయ్యలు తగలబెట్టడంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాలికి మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు రైతులకు సంబంధించిన విద్యుత్ మోటార్లు కాలి బూడిదయ్యాయి.అనంతరం మంటలు మరింత విస్తరించడంతో రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కొంతమంది రైతులు స్థానిక ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా, ప్రస్తుతం ఫైర్ ఇంజన్ అందుబాటులో లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. దీంతో మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. కాగా, పక్కనే ఉన్న కంకర మిల్లు, గురువాయిగూడెం గ్రామాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.