ఖమ్మం: మహిళా సంఘాల తొలి సోలార్ ప్లాంట్ ప్రారంభం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే తొలి పైలట్ సోలార్ ప్రాజెక్టును మంత్రి సీతక్కతో కలిసి Dy.CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎర్రుపాలెం(M) వెంకటాపురంలో నెలకొల్పిన ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం చేకూరుతుందని భట్టి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ఆకాంక్షించారు.