కలెక్టర్ చొరవతో ధాన్యాన్ని మిల్లులకు తరలించిన జిల్లా యంత్రాంగం
తేది:28.05.2026
కామారెడ్డి జిల్లా
గురువారం
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన జిల్లా యంత్రాంగం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో వేగవంతమైన చర్యలు
కామారెడ్డి జిల్లాలో ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాల కారణంగా రామారెడ్డి, దోమకొండ, సదాశివనగర్ , మాచారెడ్డి మండలాల పరిధిలోని కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (PPCs) పాక్షికంగా, పూర్తిగా తడిసిన ధాన్యం నిల్వలు నమోదయ్యాయి.
సుమారు 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం వర్ష ప్రభావానికి గురైన సందర్భంగా అధికారులు జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తహసీల్దార్లు, సివిల్ సప్లైస్ అధికారులు, DRDOలు, DCOలు, PPC ఇన్‌చార్జీలు , ఫీల్డ్ స్థాయి సిబ్బంది వెంటనే కొనుగోలు కేంద్రాలకు చేరుకుని చర్యలు చేపట్టారు.
ప్రభావితమైన 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సమీపంలోని పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి భద్రపరిచారు. ధాన్యం మరింత దెబ్బతినకుండా ఉండేందుకు రవాణా, అన్‌లోడింగ్ , నిరంతర పర్యవేక్షణ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు .
జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి తీసుకున్న చర్యలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వాతావరణ హెచ్చరికలు మరిన్ని వర్షాల అవకాశాల దృష్ట్యా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని
ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,82,760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, దాని విలువ రూ. 914.41 కోట్లుగా నమోదైంది. ఇందులో 3,27,996 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ. 783.57 కోట్ల చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మొత్తం చెల్లింపుల శాతం 86 శాతానికి చేరుకుందన్నారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు, అలాగే అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, రవాణా చెల్లింపుల ప్రక్రియలను సజావుగా కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు పర్యవేక్షిస్తున్నదని కలెక్టర్ తెలిపారు.