రెబ్బవరం వద్ద టీఎన్ఏవో రాష్ట్ర అధ్యక్షుడి కారుకు ప్రమాదం...
వైరా మండలంలోని రెబ్బవరం వద్ద టీఎన్టీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కారుపై చెట్టు కూలి ప్రమాదం జరిగింది. పొలాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే మంటలు వ్యాపించి రోడ్డు పక్కన ఉన్న చెట్టు కాలి కారుపై పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా క్షేమంగా బయటపడ్డారని, కారు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.