logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏజెన్సీలో ఆదివాసి విద్యార్థుల కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ విషయంలో భద్రాచలం ఎమ్మెల్యే కి ఫిర్యాదు

భద్రాచలం, 28 మే 2026:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో గురువారం నాడు ఒక ప్రైవేట్ హాస్పటల్ ప్రారంభానికి విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కి ఏజెన్సీలో ఆదివాసి విద్యార్థుల కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ విషయంలో గొండ్వానాసంక్షేమ పరిషత్ మెమోరాండం ఇవ్వడం జరిగింది.అనంతరం గొండ్వానాసంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ., చర్ల తహసీల్దార్ షెడ్యూల్ చట్టాల ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా,ఆదివాసి సంఘాలు ఫిర్యాదు చేస్తే నెలల తరబడి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారని ఆరోపించారు.చర్ల మండలం లో ఉన్న కొంతమంది జిపిఓ లు ముఖ్యంగా సుబ్బంపేట జిపిఓ ఆదివాసి విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ విషయంలో తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు.చర్ల రెవిన్యూ ఆఫీసులో రెవెన్యూ అధికారుల తీరు మారకపోతే జూన్ నెలలో రెవెన్యూ ఆఫీస్ ని ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆదివాసి హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇర్పారాజు, జీఎస్పి జిల్లా కార్యదర్శి గొంది లీలా ప్రసాద్ ఉన్నారు.

7
6440 views

Comment