నేలకొండపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
నేలకొండపల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను టీడీపీ నాయకులు, అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్మారకార్థం స్థానికంగా భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.