logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనకాపల్లి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పి.వి.ఎం. నాగజ్యోతి గారికి ఘన సత్కారం

అనకాపల్లి: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.వి.ఎం. నాగజ్యోతి గారికి అనకాపల్లిలో ఘన సత్కారం లభించింది. పొట్టి శ్రీరాములు భవన్‌లో నిర్వహించిన టెన్త్ టాపర్స్ అభినందన సభలో ఆమె సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ విద్యాసంవత్సరంలో రోలుగుంట పాఠశాల విద్యార్థులు ఆంగ్ల సబ్జెక్టులో శతశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. నాగజ్యోతి గారు గ్రామీణ విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయించేలా శిక్షణ అందించడం ద్వారా ఈ ఘనత సాధించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నైట్ విజిట్లు నిర్వహించడం, తల్లిదండ్రులతో సంప్రదించడం, హాస్టల్ విద్యార్థులకు అదనపు మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఆమె ప్రత్యేకత.

ఆమె మార్గదర్శకత్వంలో రోలుగుంట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు పదో తరగతి లో ఉత్తీర్ణులై ప్రత్యేక గుర్తింపు పొందారు. వాసవి క్లబ్ ప్రతినిధులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఫణిభూషణ్ శ్రీధర్ గారు, మరియు ఇతర విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నాగజ్యోతి గారికి సన్మానాలు అందజేశారు.

9
609 views

Comment