ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రమేశ్ దాబాలో కల్తీ ఆహారం సంఘటన వెలుగు చూసింది.
ఏదులాపురం మున్సిపాలిటీ
పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రమేశ్
దాబాలో కల్తీ ఆహారం సంఘటన వెలుగు చూసింది. దాబాలో భోజనం చేసేందుకు వచ్చిన ఓ ఫుడ్ ప్రియుడు ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో బల్లి
కనిపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దాబాలో కుళ్లిన చికెన్, పాడైన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు సమాచారం. వంటగది
పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు
ఆహార పదార్థాల నాణ్యతపై ఎలాంటి నిఘా లేదనిఅధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, దాబాలపై కఠిన చర్యలుతీసుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అయితేపట్టణంలో కల్తీ ఫుడ్, నాసిరకం ఆహారంపై అధికారుల నిఘా పూర్తిగా విఫలమైందని ప్రజలుమండిపడుతున్నారు. రోజురోజుకూ హోటళ్లు,దాబాల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్న ప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.