ఖమ్మం రఘునాథపాలెంలో వృద్ధాప్య పింఛను దరఖాస్తు సమస్య
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన 75 ఏళ్ల కొండ్రు రాములమ్మ వృద్ధాప్య పింఛను మంజూరు కోసం మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేశారు. ఆమె కుమారులకు వివాహాలై వేరేచోట స్థిరపడటం, భర్త రాములు మృతితో ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు. గతంలో ఆమె భర్తకు వృద్ధాప్య పింఛను వచ్చేది. ఆయన చనిపోయాక, తనకు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఆమోదించాలని నాలుగు రోజుల క్రితం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా.. ఆన్లైన్లో మీ దరఖాస్తులో మీరు మృతి చెందినట్లు నమోదైందని అధికారులు తెలపడంతో అవాక్కయ్యారు. తాను బతికే ఉన్నానని, నిరుపేదనని, పింఛను ఇప్పించాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను ప్రాధేయపడ్డారు. ఎంపీడీఓ అశోకుమార్ని వివరణ కోరగా.. తప్పుగా నమోదు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.