logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక పట్టివేత..

గుంటూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటికను నేలకొండపల్లి ఎక్సయిజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.గుంటూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటికను నేలకొండపల్లి ఎక్సయిజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. గత రాత్రి ముదిగొండ మండలం వల్లభి సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీదారులకు సరఫరా చేసేందుకు కారులో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక కారు, రెండు సెల్ఫోన్లతో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన కర్లపాటి స్వామి, షేక్ యాకుబ్ పాషా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సయిజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుంకరి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ నాటు సారా తయారీ, ముడి పదార్థాల సరఫరా, రవాణాపై ప్రత్యేక కొనసాగుతుందని చెప్పారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సయిజ్ ఎస్సై టి. లతతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

4
849 views

Comment