logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Avm haspital

*మీ జేబుకు చిల్లు పడకుండా, ప్రాణం నిలబెట్టే దేవాలయం: RVM హాస్పిటల్

*"అమ్మా, ఆపరేషన్‌కు 5 లక్షలు కావాలి" అనే మాట ఇక వినబడదు. ఎందుకంటే మన హైదరాబాద్ శివారు లొ శామీర్ పేట సమీపంలో RVM హాస్పిటల్ ఉంది.*

ఒక పేద తండ్రి కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు, ఒక తల్లి కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్ము – ఒక్క జబ్బు పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ లాగేసుకుంటుంది. ఇక ఆ బాధలు వద్దు.

JBS బస్సు స్టాండ్ నుండి గజ్వెల్ వెళ్లే దారిలో మధ్య ఉంది , పచ్చని ప్రాంగణంలో, సేవా చేయాలనీ ఉద్దేశం తో మన RVM హాస్పిటల్ * మనందరి కోసం ఎదురుచూస్తోంది.

*మీరు ఎందుకు వెంటనే వెళ్లాలి? ఇది చదవండి, మీ కళ్ళు మీరే నమ్మరు.*

*1. డాక్టర్ ఫీజు ఎంత అంటే –పూర్తిగా ఉచితం

అవును సార్, పూర్తి ఉచితంగా . ఆ ఒక్క టికెట్‌తో మీరు జనరల్ ఫిజీషియన్ దగ్గర, కీళ్ల డాక్టర్ దగ్గర, కంటి డాక్టర్ దగ్గర, ENT డాక్టర్ దగ్గర, పంటి డాక్టర్ దగ్గర, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గర – అందరి దగ్గరా చూపించుకోవచ్చు.

*బయట ఒక స్పెషలిస్ట్ ఫీజు ₹500 నుండి ₹1500. ఇక్కడ మాత్రం ఉచిత సేవా ఆలోచించండి, మీ ₹500/- నుండి 1500/-రూపాయలు మిగిలినట్టే.

*2. బయట ₹10,000 అయ్యే టెస్టులు ఇక్కడ ₹600 లోపే*

మీరు షాక్ అవుతారు, కానీ ఇది నిజం. కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు చూసి గుండె ఆగిపోయే పరిస్థితి ఇక్కడ ఉండదు.
మీకు బయట అయ్యే ఖర్చు మన RVM లో అయ్యే ఖర్చు మీకు మిగిలేది
CBP: కేవలం ₹ 50/- అదే కార్పొరేట్ హాస్పిటల్ లొ ₹500/- పైనే
లివర్ & కిడ్నీ టెస్ట్:LFT&RFT. మన RVM హాస్పిటల్ లో ₹350/- అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ₹2000
ECG + చెస్ట్ X-Ray: ₹180 /-అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ₹700
థైరాయిడ్ టెస్ట్: ₹200 అదే బయట ₹ 900/-
మామ్మోగ్రఫీ: ₹300/- అదే బయట ₹4000
*ఒక్కరోజులో ₹6000/- నుఁడి ₹10000/-కు పైగా ఆదా.* మరో విషయం : ఇక్కడ CT స్కాన్ కేవలం ₹1000/-
MRI స్కాన్ కేవలం ₹ 2500/-
కాన్సర్ కి సంబందించిన PET స్కాన్ కేవలం ₹ 9999/-
ఆ డబ్బుతో మీ పిల్లలకు ఒక నెల సరుకులు వస్తాయి సార్.

*3. ఇది హాస్పిటల్ కాదు, ఫైవ్ స్టార్ హోటల్*

40 ఎకరాల్లో పచ్చదనం మధ్య ఉన్న హాస్పిటల్. గాలి, వెలుతురు, పరిశుభ్రత. బాత్‌రూమ్ నుండి బెడ్ వరకు అద్దంలా మెరుస్తూ ఉంటుంది. క్యాంటీన్‌లో వేడి వేడి అన్నం, కూర, పప్పు, సాంబార్ తో అడ్మిట్ అయినా పేషెంట్ కి భోజనం.. సదుపాయం

*4. వెళ్లడం చాలా ఈజీ – జేబుకు భారం కాదు*
JBS బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్సులు. *బస్ టికెట్ ₹30 మాత్రమే.* ఆటో అయినా ₹30-₹50. ఉదయం 9 గంటలకు వెళ్తే, టెస్టులతో సహా అన్నీ అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. ఆఫీసుకు సెలవు పెట్టాల్సిన పని లేదు.

*5. 1350 బెడ్లు, 750 మంది డాక్టర్లు – మీ కోసమే*

మనలాంటి సామాన్యులకు వైద్యం అందాలని 24 గంటలు అంకితభావంతో పనిచేస్తున్నారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రల నుండి వచ్చిన సరే, ఆధార్ కార్డు ఉంటే చాలు. తెలుగులోనే మాట్లాడతారు, ప్రేమగా ట్రీట్‌మెంట్ ఇస్తారు.

*ఇంకా ఆలోచిస్తున్నారా?*

మీ పక్కింటి వాళ్లు, మీ బంధువులు, మీతో పనిచేసే తోటి వర్కర్స్ – ఎవరైనా జబ్బుతో బాధపడుతున్నారా? లక్షలకు లక్షలు అప్పు చేస్తున్నారా? వెంటనే ఈ మాట చెప్పండి: *"ఒక్కసారి మన RVM హాస్పిటల్ కు వెళ్లిరా."*

మీరు ఫార్వర్డ్ చేసే ఈ ఒక్క మెసేజ్ ఒక కుటుంబాన్ని అప్పుల ఊబి నుండి బయటకు లాగవచ్చు. ఒక తల్లి కన్నీళ్లు తుడవవచ్చు. ఒక నాన్న గుండె ధైర్యం నింపవచ్చు.

*ఇది ప్రవేట్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అని చులకన చేయకండి. ఇది మన ఆస్తి. మన కోసం కట్టిన ప్రపంచ స్థాయి హాస్పిటల్. దీన్ని పూర్తిగా వాడుకుందాం.*

*అడ్రస్:* RVM హాస్పిటల్, సిద్దిపేట జిల్లా. శామీర్ పేట దగ్గర వంటిమామిడి.

*ఓపీ టైమ్:* ఉదయం 9 నుండి చూస్తారు
ఇంకా ఎమర్జెన్సీ అయితే 24 గంటలు చూస్తారు..
యూరలజీ సర్జరీ ,.న్యూరాలజీ సర్జరి .కార్డిలజీ సర్జరీ. గ్యాస్ట్రో సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ. కాన్సర్ కి సంబందించిన చికిత్స. సంతాన సపల్య కేంద్రం. ప్లాస్టిక్ సర్జరీ. గ్యాస్ట్రో ఏంట్రోలాజి.బ్లడ్ బ్యాంకు ఆలా అన్ని రకాల వ్యాధులకు ఓకే దగ్గర వైద్యం అందుబాటులో ఉంది
మరియు
అక్కడ హాస్పిటల్ లో అడ్మిట్ అయితే వైద్య సేవలు ఉచితంగా కూడా చేస్తున్నారు
అడ్మిట్ అయినా రోగులకు ఉచిత భోజన సదుపాయాలు ఉన్నవి

( ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ లు చేస్తారు )

*ఈరోజే మీ ఫోన్‌లోని 10 గ్రూపులకు పంపండి

*ఇట్లు,*
*మీ శ్రేయోభిలాషి*
నేను ఒక సహాయం పొందిన వ్యక్తి...

509 views

Comment
  • Voore Ravinder

    షాపింగ్ మాల్ కాదు RVM హాస్పిటల్స్