బక్కని నర్సింహులు యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి - నాగిళ్ళ శంకర్
నల్గొండ:27/05/26
“తెలంగాణ” అనేది ఒక “పదం” కాదని, “డిక్షనరీలో వెతికేందుకు లేదు” అంటూ వ్యాఖ్యలు చేసిన బక్కని నర్సింహులు తీరు పై తెలంగాణ ఉద్యమకారుడు చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శంకర్ మాట్లాడుతూ.. నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవ పోరాటాల ప్రతీక అయిన తెలంగాణను చులకనగా చేసి మాట్లాడటం సరికాదన్నారు. సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై బక్కని నర్సింహులు వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నాగిళ్ళ శంకర్ డిమాండ్ చేశారు.