logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.మహానాడు వేదికగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మొదటి రోజు బుధవారం నాడు స్థానిక శ్రీ రామ కళ్యాణ మండపం మరియు నియోజకవర్గ మండలాల్లో పండుగ వాతావరణంలో మహా ఉత్సాహంగా ప్రారంభమైంది. స్థానిక శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ మహానాడుకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ. పార్టీ శ్రేణులతో కలిసి ఈ చారిత్రాత్మక మహానాడులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అఖిలప్రియ గుర్తుచేశారు. ఈ పథకాలను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ చేరవేయడంలో కూటమి కార్యకర్తలు ముందుండాలని కోరారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.మహానాడుకు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజా ఉత్సాహమే తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయానికి, బలమైన భవిష్యత్తుకు నిదర్శనం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

91
2295 views

Comment