వడ్లు, మక్కలు కొనడంపై ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ వివాదం
తెలంగాణ: వడ్లు, మక్కలు కొనమంటే ఆర్టీసీ డ్రైవర్ ను సస్పెండ్ చేసిన విషయంపై గందరగోళం నెలకొంది. అయితే రూ. 1,000 కోట్ల భూ కుంభకోణంలో ఉన్న ఎమ్మార్వోను డిస్మిస్ చేయకపోవడం ప్రశ్నిస్తున్నరు. భూమి సంబంధ అంశాల్లో రెవిన్యూ మంత్రికి భాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, రెస్పాండ్ చేయలేదని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి చెప్పారు.
ఎమ్మార్వోను ట్రాన్స్‌ఫర్ చేసి కలెక్టర్ సంజాయిషీ ఇచ్చిన సంగతి కూడా తప్పు కాదా అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణం వెనుక TMREIS వైస్ చైర్మన్ ఉన్నారని, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆయన ఇంటి దగ్గర క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పెద్దలు అర్హత లేని వ్యక్తిని ఎలా కాపాడుతున్నారో కూడా విమర్శించారు.