కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఈరోజు శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కార్యనిర్వాహక సమావేశం
నేడు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమనీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర కో ఇంచార్జ్ రోషిణి జైస్వాల్,జిల్లా ఇంచార్జ్ థామస్ గారు ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, గ్రామ స్థాయి నుండి పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి మండలం, గ్రామంలో గ్రామ కమిటీలు వేసి సంఘటితం చేసి పార్టీకి బలమైన పునాది నిర్మించాలని సూచించారు.
సమావేశంలో బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్ గారు బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల అభిషేక్ మొహమ్మద్ అబ్బు, సాజిద్,అజీమ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది